శిక్షించకపోతే అరాచకమే : పవన్ కళ్యాణ్
1 min readపల్లెవెలుగు వెబ్: రాష్ట్రంలో తెలుగుదేశం కార్యాలయాలపైన, నాయకుల పైన దాడుల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. దాడులను ఆయన ఖండించారు. పార్టీ కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదని అన్నారు. రాష్ట్రంలో పరిణామాలపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నియంత్రణ అవసరమని చెప్పారు. పార్టీ కార్యాలయాలు, వ్యక్తుల పై దాడులు అరాచకానికి దారితీస్తాయని అన్నారు. నిందితులను శిక్షించకపోతే రాష్ట్రం అరాచకానికి చిరునామాగా మారుతుందన్నారు.