NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రంలో అరాచక పాలన…..

1 min read

– యమల మణికంఠ  ఐటిడీపీ 

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కర్రలు, రాళ్లతో దాడులు చేయడం అమానుషం ,చిత్తూరు జిల్లాలో శుక్రవారం అల్లర్లు సృష్టించిన వైసీపీ నేతలు శనివారం బంద్ ప్రకటించటం చూస్తే దొంగే దొంగ అన్నట్లుగా ఉంది ,చిత్తూరు జిల్లాలో పలు పట్టణాలలో బంద్ సందర్భంగా షాపుల మీద దాడులు చేయడం, బలవంతంగా మూసేఇంచడం సిగ్గుచేటు,అమర్ రాజా బస్సును ఆపి టైర్లలో గాలి తీయడమే గాక బస్సులో ఉన్న ఉద్యోగులపై దాడులు చేయటం ను తీవ్రంగా ఖండిస్తున్నాను,వైసిపి ప్రభుత్వ వేధింపులు భరించలేకనే అమర్ రాజా కంపెనీ ఇప్పటికే తెలంగాణకు వెళ్ళిపోయింది, పరిశ్రమలు పెట్టడం చేతకాని వైసీపీ నాయకులు ఉన్న పరిశ్రమలు కూడా పంపించి ఆనందం పొందుతున్నారు,భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను పోలీసులు వైసిపి నాయకుల ప్రేరణతో టిడిపి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు,చంద్రబాబు నాయుడు గారిపై మరియు కార్యకర్తలపై దాడులు జరిగితే సహించి ఊరికినేది లేదు,వైసీపీ నేతలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రతిపక్షాలపై దాడులు చేయడం మానుకోవాలి,2024 లో రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వస్తుంది అప్పుడు ఇప్పుడు నేరాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోక తప్పదు,పోలీసులు చట్టపరంగా వ్యవహరించి టిడిపి నాయకుల మీద దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు నేతల మీద కేసు నమోదు చేయాల్సిందిగా ఆయన అన్నారు .

About Author