NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేటీఆర్ ను ప్రశ్నించిన యాంక‌ర్ అన‌సూయ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : చిన్నారుల భ‌ద్రత విష‌యంలో కొన్ని పాఠ‌శాల‌లు అనుస‌రిస్తున్న తీరుపై న‌టి అన‌సూయ అస‌హ‌నం వ్యక్తం చేశారు. పిల్లల్ని తిరిగి స్కూళ్లకు పంపాలంటూ కొన్ని స్కూళ్లు ఒత్తిడి తెస్తున్నాయ‌ని ఆమె అన్నారు. పిల్లల భ‌ద్రత పై స్కూల్స్ ఎలాంటి భ‌రోసా ఇవ్వడం లేదంటూ శుక్రవారం ఆమె కేటీఆర్ కు ట్వీట్ చేశారు. దేశంలో వ్యాక్సినేష‌న్ వేగంగా జ‌రుగుతోంద‌ని, వ్యాక్సిన్ తీసుకోని చిన్నారుల ప‌రిస్థితి ఏంట‌ని ఆమె ప్రశ్నించారు. స్కూల్ లో పిల్లల‌కు ఏం జ‌రిగినా యాజ‌మాన్యానిది బాధ్యత కాద‌ని చెబుతూ త‌ల్లిదండ్రులు ఓ అంగీకార ప‌త్రాన్ని ఇవ్వాల‌ని స్కూల్స్ ఎందుకు ఒత్తిడి తెస్తున్నాయ‌ని అన్నారు. ఇదెక్కడి న్యాయం సార్ అంటూ అస‌హ‌నం వ్యక్తం చేశారు. ఈ విష‌యం పై స‌మీక్ష చేస్తార‌ని ఆశిస్తున్నానని అన్నారు.

About Author