NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇక మేం చేతులెత్తేయాల్సిందే.. సుప్రీం వ్యాఖ్య !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఎన్నిక‌ల్లో నేర‌చ‌రితులు ఏరివేత‌పై మేమూ చేతులు ఎత్తివేయాల్సిందే అంటూ సుప్రీం కోర్టు పెద‌వి విరిచింది. ఇప్పటికే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తూ.చ‌. త‌ప్పకుండా ఆచ‌రించ‌డంలో రాజ‌కీయ పార్టీల అల‌సత్వాన్ని త‌ప్పుప‌ట్టింది. 2020 ఫిబ్రవ‌రి 13న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమ‌లు చేయ‌డంలో విఫ‌ల‌మైన రాజ‌కీయ పార్టీల‌పై కోర్టు ధిక్కర‌ణ చ‌ర్యలు చేప‌ట్టాలంటూ దాఖ‌లైన పిటిష‌న్ పై సుప్రీం ధ‌ర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసి, తీర్పు వాయిదా వేసింది. గ‌త ఏడాది బీహార్ ఎన్నిక‌ల్లో సుప్రీం తీర్పును అమ‌లు చేయ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను ఈసీ త‌ర‌పు న్యాయ‌వాది సుప్రీంకు విన్నవించారు. అభ్యర్థుల‌ను చివ‌రి క్షణంలో ప్రకటించ‌డం వంటి కార‌ణాల‌ను ఈసీ తర‌పు న్యాయ‌వాది కోర్టు ముందు ఉంచారు.

About Author