అండగా… జగనన్న సురక్ష
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆలూరు నియోజకవర్గం,ఆస్పరి మండలంలోని కైరుపల గ్రామం నందు సర్పంచ్ K.తిమ్మక్క, ఆస్పరి ఎమ్మార్వో కుమారస్వామి ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ..గ్రామంలోని ప్రతి ఒక్కరూ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు కైరుప్పల గ్రామంలో ఆదాయ ధ్రువీకరణ పత్రలు 97, కుల ధ్రువీకరణ పత్రాలు101 అందజేయడం జరిగిందని,వివిధ ధ్రువీకరణ పథకాలను మరల పొందడానికి అక్కడ ఏర్పాటు చేసిన క్యాంపుల ద్వారా తీసుకున్న దరఖాస్తులను సచివాలయానికి తీసుకెళ్లి వాటిని అక్కడే సమర్పించి టోకెన్ నెంబర్, సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్, తీసుకొని వాటిని తిరిగి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తారని ఈ క్యాంపులు ఎప్పుడూ ఎక్కడ నిర్వహిస్తారో ముందుగానే తెలియజేసి వారిని ఆరోజు నుండి క్యాంపు వద్దకు తీసుకెళ్తారని వాలంటీర్లకు సూచించినట్లు వారు తెలిపారు.ఈ సురక్ష కార్యక్రమంలో ద్వారా ప్రతి సమస్య పరిష్కారం అయ్యేలా వారికి తోడగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆస్పరి సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, ఆస్పరి వైకాపా మండల కన్వీనర్ పెద్దయ్య, జేసిఎస్. మండల కన్వీనర్. బసవరాజు, ఆస్పరి సొసైటీ సీఈవో అశోక్, బీటెక్ వీరభద్ర, కుక్కల రంగన్న, తిమ్మప్ప, ప్రకాష్ , రాజన్న గౌడ్,విజయ్ కుమార్ ,గోవిందరాజులు, ఉప సర్పంచ్ స్వాతి, ఎంపీటీసీ భర్త లక్ష్మన్న, బజారప్ప, ఉరుకుందు, వీరేష్, రామచంద్ర, గోపాల్, పరశురాముడు, ఈ.వో.అర్.డి.నరసింహులు వీఆర్వో మరియు ఆయా శాఖల అధికారులు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.