సంక్షోభంలో ఆంధ్రా ఆర్థిక స్థితి !
1 min readపల్లెవెలుగువెబ్ : మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో మునుపెన్నడూ లేని ఆర్దిక సంక్షోభం నెలకొందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… జగన్ రెడ్డి అహంభావం, చేతగానితనం, మొండితనంతోనే ఈ అనర్ధం జరిగిందన్నారు. బహిరంగ మార్కెట్ రుణాలతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 3 ఏళ్లలో టీడీపీ హయాం కంటే రూ.86,865 కోట్లు అధికమని తెలిపారు. కేంద్ర నిధులు కూడా కలిపితే రాష్ట్ర ప్రభుత్వ మొత్తం ఆదాయం రూ.1,25,995 కోట్లు ఎక్కువ వచ్చిందని అన్నారు. ఆదాయంలో అనేక రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉందని ఆయన చెప్పారు. పనితీరులో, వివిధ శాఖల పురోగతిలో మాత్రం అట్టడుగున ఉందని విమర్శించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కోవిడ్ ప్రభావం ఏపీపై తక్కువే అని అన్నారు.