NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆంధ్రా నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలి : టీ-మినిష్టర్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆంధ్ర నాయ‌కులు జాగ్రత్తగా మాట్లాడాల‌ని తెలంగాణ మంత్రి శ్రీనివాస‌రెడ్డి హెచ్చరించారు. అన్యాయం చేస్తున్న వారే ప‌రుష ప‌ద‌జాలం ఉప‌యోగిస్తున్నార‌ని ఆక్షేపించారు. ఉమ్మడి రాష్ట్రంలో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కు తీవ్ర అన్యాయం చేశార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. మీ ప్రాంతంలో యూనివ‌ర్శిటీలు, ప్రాజెక్టులు క‌ట్టారు కాబ‌ట్టే… మీ నాయ‌కులు దేవుళ్లు కావ‌చ్చు, కానీ అన్యాయానికి గురైన త‌మ‌కు కాద‌ని తెలిపారు. ప్రత్యేక రాష్ర్టం వ‌చ్చాక పాల‌మూరు ప్రాంతానికి నీళ్లు వ‌చ్చాయ‌ని సంబ‌ర‌ప‌డేలోపు.. నీటిని దోచుకెళ్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే చూస్తూ ఉరుకోమ‌ని, ప్రాజెక్టులు అడ్డుకుంటామ‌ని స్పష్టం చేశారు.

About Author