PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉల్లాసంగా …ఉత్సాహంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర

1 min read

జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ డి .మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి, కమిషనర్ వెంకటకృష్ణ, డిఇఓ శ్యాంసుందర్, పలువురు ప్రజాప్రతినిధులు..

ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ ఈనెల 26 నుంచి ఆడుదాం..

ఆంధ్రా క్రీడా సంబరాల సందడి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ ముఖ్యంగా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు నిర్వహిస్తున్న ఆడుదాం.ఆంధ్ర క్రీడా సంబరాలు ఎంతో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. డిసెంబర్ 26 నుంచి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఆడుదాం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆంధ్ర క్రీడా పోటీలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఆదివారం నిర్వహించిన  3 కె రన్ ను జిల్లా ఎస్పీ డి .మేరీ ప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు . కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి, డిఆర్వో యం. వెంకటేశ్వర్లు ,నగరపాలక సంస్థ కో- ఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు, ఈడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు ఆళ్ల సతీష్ చౌదరి, జడ్పీ సీఈఓ కె.సుబ్బారావు ఏలూరు ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి, మున్సిపల్ కమిషనర్ ఎస్ .వెంకటకృష్ణ, డి ఎస్ డి ఓ బి. శ్రీనివాసరావు ,హౌసింగ్ పీడీ కె రవికుమార్ ,డిఆర్డిఏ పిడి ఆర్.విజయ రాజు , ఉద్యానశాఖ డిడి రామ్మోహన్ ,డి ఎల్ డి ఓ లక్ష్మి, డిఎస్ఓ ఆర్ఆర్ రాజు, డీఎస్ఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, తాహాసిల్దార్లు బి సోమశేఖర్ 8విజయ్ కుమార్ ,ఎంఈఓ సబ్బితి, ఎన్ ఐ సి శర్మ తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహపూరితంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర టోర్నమెంటు   3 కె రన్ వట్లూరు సమీపంలోని హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు నుంచి ప్రారంభమై సత్రంపాడు, సి ఆర్ రెడ్డి కళాశాల ,ఆర్టీసి కొత్త బస్టాండ్, జడ్పీ కార్యాలయం మీదుగా ఇండోర్ స్టేడియం చేరుకుంది. ఈ  3 కె రన్ లో పెద్దల నుంచి చిన్నారుల వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ యువతలో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ,క్రీడలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ వెలికితీయడమే కాకుండా ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించేందుకు ఎంతో దోహదపడతాయన్నారు. గ్రామ/ వార్డు సచివాలయ స్థాయి నుంచి 5 దశల్లో పోటీలు నిర్వహించబడతాయన్నారు. జిల్లాలో ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న క్రీడా సంబరాల్లో పాల్గొనేందుకు 1,47,000 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. జిల్లాలోని 625 గ్రామ సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు క్రీడా పోటీల నిర్వహణ కోసం 320 ఆట స్థలాలను సిద్దం చేయడం జరిగిందన్నారు. ఇందులో క్రికెట్, వాలీబాల్, కోకో, కబాడీ, బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించేందుకు 14, 354 టీములను ఏర్పాటు చేసి 7,198 మ్యాచ్ లను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ప్రస్తుత కాలంలో మొబైల్, టీవీ తదితర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లకు అలవాటు పడిపోయి బయటకు వచ్చి ఆడుకోవాలనే ఆసక్తి తగ్గుతున్న క్రమంలో ఆడుదాం.. ఆంధ్ర టోర్నమెంట్ ద్వారా బయటకు వచ్చి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఆడుదాం ..ఆంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమం ద్వారా మంచి క్రీడాకారులను గుర్తించడమే కాకుండా వారికి శిక్షణ ఇచ్చి జాతీయస్థాయిలో పోటీలకు పంపించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 15 సంవత్సరాల వయసు పైబడిన వారందరూ ఈ టోర్నమెంట్ లో పాల్గొనవచ్చునన్నారు.జిల్లా ఎస్పీ డి .మేరీ ప్రశాంతి మాట్లాడుతూ  గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల ప్రతిభ బయటకు వచ్చేందుకు ఆడుదాం ..ఆంధ్ర కార్యక్రమం మంచి ఫ్లాట్ ఫామ్ అని పేర్కొన్నారు. క్రీడల ద్వారా శారీరక, మానసిక ఉల్లాసం మానసిక ధైర్యం కలుగుతుందన్నారు .ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహవంతంగా పాల్గొని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.జిల్లా జాయింట్ కలెక్టర్ బి .లావణ్య వేణి మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఉద్దేశించబడిన ఆడుదాం ..ఆంధ్ర క్రీడా సంబరాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. తద్వారా క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు జిల్లావ్యాప్తంగా ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు గ్రామ,మండల ,నియోజకవర్గ ,జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహించబడతాయని ఇక్కడ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపడం జరుగుతుందన్నారు. ఏలూరు జిల్లా నుంచి రాష్ట్రస్థాయిలో పాల్గొని ఎక్కువ బహుమతులు పొందాలని ఆమె ఆకాంక్షించారు.క్రీడల్లో ప్రతిభ ఉండి గుర్తింపు రానివారు ఇటువంటి క్రీడ ఉత్సవాలలో పాల్గొంటే రాణించే అవకాశాలు ఉంటాయన్నారు. ఈ పోటీల్లో ఆయా స్థాయిల్లో కూడా ప్రభుత్వం నగదు బహుమతులను అందిస్తుందన్నారు. నియోజకవర్గ స్థాయిలో మొదటి ,రెండు ,మూడవ స్థానాలకు రూ.35 వేలు రూ 15 వేలు, రూ .5 వేలునగదు బహుమతులు అందించడం జరుగుతుందని జిల్లా స్థాయిలో మొదటి రెండు మూడు స్థానాలకు వరుసగా రూ. 60 వేలు రూ.30 వేలు,10 వేలు, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం రూ. 5 లక్షలు రెండవ స్థానం రూ. 3 లక్షలు మూడవ స్థానం రూ . 2 లక్షలు నగదు బహుమతులు అందజేయబడతాయన్నారు.

3 కె రన్ విజేతలకు నగదు బహుమతులుఆడుదాం.ఆంధ్రా త్రీ కె రన్ లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతులను జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్,,జిల్లా ఎస్పీ డి .మేరీ ప్రశాంతి ,జాయింట్ కలెక్టర్ బి .లావణ్య వేణి చేతుల మీదుగా ప్రధానం చేశారు. మహిళా విభాగంలో మొదటి బహుమతి ఏలూరుకు చెందిన తిరుమాని లక్ష్మీ హర్ష 14 నిమిషాల 39 సెకన్లు ,ద్వితీయ బహుమతి ఏలూరుకు చెందిన కసక్ గోర్ 14 నిమిషాల 42 సెకన్లు ,తృతీయ బహుమతి గోపన్నపాలెం కు చెందిన వనపాల సత్య పూజిత 16 నిమిషాల 11 సెకన్లు ,పురుషుల విభాగంలో ఏలూరుకు చెందిన దీర్ఘాల విష్ణువర్ధన్ 11 నిమిషాల 38 సెకన్లు,ద్వితీయ బహుమతి గుజుపునేని వెంకట లోకేష్ 11 నిమిషాల 40 సెకన్లు ,తృతీయ బహుమతి మామిడి జయరాజు 15 నిమిషాల 20 సెకన్ల లో తమ గమ్యస్థానాన్ని చేరుకొని విజయం సాధించారు.

విజేతలైన మహిళలు ,పురుషులకు

ప్రథమ బహుమతిగా మెమెంటో, రూ.15 వేల నగదు, ద్వితీయ బహుమతిగా మెమెంటో రూ.10 వేల నగదు, తృతీయ బహుమతిగా మెమెంటో రూ. 5 వేలు నగదు బహుమతులు ప్రధానం చేశారు.

About Author