ఆంధ్ర ప్రదేశ్ పరిమితికి మించి అప్పు చేసింది !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిమితికి మించి అప్పు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ ఏడాది 4 వేల కోట్లకు పైగా అప్పు చేసిందని పార్లమెంట్ లో ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 54,369 కోట్లు ఆర్థిక లోటుగా రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్ లో స్పష్టం చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 49,497 కోట్లు అప్పు పొందేందుకు అవకాశం ఇచ్చినట్టు కేంద్ర మంత్రి తెలిపారు.