NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆంజ‌నేయుడి జ‌న్మస్థలం ఆంధ్రప్రదేశ్..?

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్: రామ భ‌క్తుడు శ్రీ ఆంజ‌నేయుడి జ‌న్మ స్థలం మీద ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆంజనేయుడి జ‌న్మస్థలం తిరుమ‌ల అని తితిదే ఈవో జ‌వ‌హ‌ర్ రెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సేక‌రించామ‌ని తెలిపారు. తమ వ‌ద్ద ఉన్న ఆధారాల ప్రకారం ఖ‌చ్చితంగా ఆంజ‌నేయుడి జ‌న్మస్థలం తిరుమ‌లే అని జ‌వ‌హ‌ర్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి పండితుల వ‌ద్ద కూడ ఆధారాలు ఉన్నట్టు చెప్పారు. ఇప్పటి వ‌రకు ఏ రాష్ర్టం ఆంజ‌నేయుడు త‌మ ప్రాంతంలో జ‌న్మించిన‌ట్టు చెప్పలేద‌ని, ఎవ‌రి వ‌ద్దనైనా ఆధారాలుంటే ముందుకు రావాల‌ని కోరారు. ఆంజ‌నేయుడు జ‌న్మస్థలం మీద క్షేత్ర స్థాయిలో చ‌ర్చ జ‌ర‌గాలని ఆయ‌న అన్నారు.

About Author