అంగన్ వాడి కేంద్రాన్ని కౌన్సిలర్ ఆకస్మికంగా తనిఖీ
1 min read– నాణ్యమైన విద్యతోపాటు పసిపిల్లల పట్ల బాధ్యత వహించండి
– 5వ వార్డు కౌన్సిలర్ రేష్మ
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు బైరెడ్డి శేషశయనా రెడ్డి నగర్ లోని అంగన్ వాడి కేంద్రాన్ని 5వవార్డు కౌన్సిలర్ షేక్ రేష్మ శనివారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు రోజుల క్రితం బుధవారం నాలుగు సంవత్సరాల పసిపాప ఆలియా పై కుక్క దాడి నేపథ్యంలో అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి అంగన్ వాడి కేంద్రం కార్యకర్త ,ఆయాలకు పలు సూచనలు సూచించారు. పసిపిల్లలపై వరుస కుక్కల దాడులతో తీవ్ర బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలను తరలించే ప్రక్రియను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను అతి త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. పిల్లలకు నాణ్యమైన విద్యతోపాటు పిల్లలకు రక్షణ కల్పించేలా అంగన్వాడీ టీచర్ మరియు ఆయాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం వార్డు ఇంచార్జ్ సన అబ్దుల్లా , వైసీపీ నాయకులు మార్కెట్ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గర్భిణీ స్త్రీలు బాలింతలు మరియు అంగన్వాడి పిల్లల కోసం “జగనన్న గోరుముద్ద” పథకం యొక్క ఉద్దేశ్యం తెలియజేశారు .ప్రతిరోజు పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనము, గర్భిణీ స్త్రీలకు పాలు గుడ్లు తప్పనిసరిగా అందించాలని అంగన్వాడీ టీచర్ ఆయాలకు సూచించారు.