NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగన్​ వాడీల ఉద్యమం.. ఉధృతం..

1 min read

చాగలమర్రి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ హెచ్చరిక

చాగలమర్రి, పల్లెవెలుగు: తమ డిమాండ్లను పరిష్కరించుకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ మంగళవారం అంగన్వాడి కార్యకర్తలు అంగన్వాడి సహాయకులు  ఖాళీ కంచాలను గరిటలతో మ్రోగించి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చంద్రకళ మాట్లాడుతూ 15 రోజులుగా నిరవధిక సమ్మెలో  తమ డిమాండ్లను తెలియజేస్తున్నప్పటికీ స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు  ఉద్యమ కార్యాచరణ ప్రకారం దీక్షలు చేపట్టడం జరుగుతుందన్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకు దశలవారిగా ఉద్యమిస్తామన్నారు. 27న శాసనసభ్యులకు వినతిపత్రం అందజేస్తూ 28 ముఖ్యమంత్రి కి పోస్ట్ కార్డు ద్వారా  సమస్యలను తెలియజేస్తామన్నారు. 29న రిలే దీక్షలు, 30న గ్రామ వార్డు సచివాలయం వద్ద, ప్రజా సంఘాల సహకారంతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామన్నారు. అప్పటికి స్పందించకుంటే జనవరి ఒకటి నుండి అన్ని పార్టీలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలతో వారు హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు గుత్తి నరసింహుడు, ఏఐటీయూసీ  మండల నాయకురాలు వహీదా సుజాత,ఇందుమతి, రహమత్,అహల్య, గుర్రమ్మ, మేరీ, జ్యోతి, సిఐటియు  నాయకురాలు సంజమ్మ, రజిని, రామసుబ్బమ్మ,తదితరులు ఉన్నారు.

About Author