PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగన్​వాడీ కేంద్రాలను.. అభివృద్ధి చేస్తాం.. : కలెక్టర్ డా.జి.సృజన

1 min read

పల్లెవెలుగు: అంగన్వాడీ కేంద్రాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సిడిపిఓలతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న సమస్యలను చర్చిస్తూ 360 అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్లు లేవని, 151 కేంద్రాలలో పనిచేయని మరుగుదొడ్లు మరమ్మత్తులు చేయించాలని, 481 కేంద్రాలలో నీటి కొళాయిలు ఏర్పాటు చేయాలని, 306 కేంద్రాలలో విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయిస్తామని కలెక్టర్ తెలిపారు. 81 కేంద్రాలను నాడు-నేడు కింద చేపట్టడం జరిగిందని పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఇందులో కొన్నింటికి ప్లాన్ నందు మరుగుదొడ్లు చూపెట్టలేదని వాటిని ఏజెన్సీ లతో మాట్లాడి నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాలలో నేల కంటే కిందకి ఉన్న వాటిని సరి చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు టీచర్లు, ఆయాలు కొరతను భర్తీ చేస్తామని, వంట పాత్రల సామాగ్రి, బరువు చూసే స్కేలు, పసిపిల్లల బరువు తూచే పరికరము కొని పంపిణీ చేస్తామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే ఆయాలు, వంట మనుషులు, టీచర్లు విధులు సరిగా నిర్వర్తించని యెడల కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే పోలీస్ కేసులు పెట్టి విచారణ జరిపి ఉద్యోగాల నుండి తీసివేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా మరియు శశి శిశు సంక్షేమ అధికారిణి ఉమామహేశ్వరి, సిడిపిఓలు పాల్గొన్నారు.

About Author