అంగన్వాడి పిల్లలకు మంచి పోషకాహారం అందించాలి…
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/12-11.jpg?fit=550%2C413&ssl=1)
వారి పొడవు , బరువు కొలతలు పోషణ ట్రాకర్ లో పొందుపరిచే చర్యలు తీసుకోవాలి….
గ్రోత్ మానిటరింగ్ అవగాహన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య…
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అంగన్వాడి పిల్లలకు సక్రమమైన పోషకాహారాన్ని అందించాలని, వారి వారి వయసుకు తగ్గ పొడవు , బరువు కొలతలు సక్రమముగా తీసుకొని పోషణ ట్రాకర్ లో ఎక్కించాలని , వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య అంగన్వాడి సిబ్బందిని ఆదేశించారు.మంగళవారం ఉదయం వెల్దుర్తి , కోడుమూరు , కర్నూలు ప్రాజెక్టుల అంగన్వాడి కార్యకర్తలు ,సూపర్వైజర్లు ,సిడిపివోల శిక్షణ కార్యక్రమం ను జాయింట్ కలెక్టర్ బి .నవ్య జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. పిల్లల వయసుకు తగ్గ బరువు , పొడవు లను కొలిచి జిల్లా జాయింట్ కలెక్టర్ కు చూపించారు .ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అంగన్వాడి సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ… మన రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చినప్పుడు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, గర్భిణులకు, బాలింత లకు మంచి పోషకాహారాలను అందిస్తోందని కావున మన రాష్ట్ర పిల్లలు, గర్భిణీలు, బాలింతలు , సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని ఆ విధంగా అంగన్వాడి సిబ్బంది మొత్తం కృషి చేయాలని ఇందులో ఎటువంటి తప్పులు పొరపాట్లు జరగరాదని ఆదేశించారు. అంగన్వాడి పిల్లల వయసుకు తగిన పొడవు , బరువు సక్రమంగా రికార్డు చేసి పోషణ ట్రాకర్ లో పొందుపరచాలని ఆదేశించారు.ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ నిర్మల… మాట్లాడుతూ జిల్లాలోని అంగన్వాడి సిబ్బంది అందరూ పిల్లల కొలతలు తీసుకొని అవి వారి వయసుకు తగ్గ విధంగా ఉన్నవా లేవా పరీక్షించుకోవాలని ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే స్థానికంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల తెలియజేయాలని , వారి సూచనలు మేరకు వారికి ఆరోగ్యపరమైన తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించి వారి ఆరోగ్యాలు బాగుగా ఉండే విధంగా ప్రతిరోజు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లలకు ప్రతిరోజు ఆరోగ్య సూత్రాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లల బరువు , పొడవులు కొలిచే సాధనాలైన ఇన్ఫేంటో మీటర్ , స్టిడో మీటర్ ద్వారా ప్రత్యక్షంగా పిల్లల బరువు పొడవు కొలుచు విధానాన్ని చూపించారు. పోషణ ట్రాక్టర్ పిల్లల పొడవు బరువు నమోదు చేసే విధానాన్ని వివరించారు.ఈ అవగాహన కార్యక్రమానికి కోడుమూరు, వెల్దుర్తి, కర్నూలు ప్రాజెక్టు లకు చెందిన సిడిపిఓ లు వరలక్ష్మమ్మ, అనురాధమ్మ ,మద్దమ్మ ,బాలమ్మ , నరసమ్మ మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/121-3.jpg?resize=550%2C677&ssl=1)