NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగన్వాడి రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా స్వాతి

1 min read

హర్షం వ్యక్తం చేస్తున్న సిఐటియు..

పల్లెవెలుగు వెబ్ కమలాపురం:  సమస్యలపై పోరాటాలు చేస్తున్న వారిని గుర్తించి ఉన్నతమైన స్థానం కల్పించడం సంతోషకరమైన విషయమని జిల్లా సిఐటియు హర్షం వ్యక్తం చేశారు, రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె లో పాల్గొన్నప్పుడు సమస్యలపై కమలాపురంలో పోరాటంలో ముందుండి పోరాటంలో చేసిన స్వాతిని గుర్తించి, ఏపీ అంగన్వాడీ రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా నియమించడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు, ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వర్క్షాప్ విజయవాడ నందు జరిగిన సమావేశంలో కమలాపురం పనిచేస్తున్న స్వాతిని ప్రకటించారని కమలాపురం ప్రాజెక్టు అధ్యక్షురాలు వెంకటేశ్వరమ్మ, ప్రభావతి విజయాలు అన్నారు, రాష్ట్ర కమిటీకి అంగన్వాడి సిఐటియుకు యూనియన్ కృతజ్ఞతలు అని తెలిపారు.

About Author