PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గత 24 రోజుల నుండి తమ హక్కుల సాధన కోసం అంగన్వాడీలు నిరవధిక నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు గురువారం నాడు గడివేముల మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు తమ నిరసన తెలియజేశారు అంగన్వాడి మండల నాయకురాలు రాములమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఐదో తేదీ కల్లా విధుల్లో చేరకపోతే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తుందని ఉద్యమం మొదలుపెట్టాక తమ డిమాండ్లు నెరవేరేంతవరకు వెనక్కి తగ్గేది లేదన్నారు ఈ కార్యక్రమంలో వసంత లక్ష్మి. అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author