PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిఐటియు ఆధ్వర్యంలో  అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె

1 min read

సంఘీభావం ప్రకటించిన తెలుగుదేశం పార్టీ

పల్లెవెలుగు వెబ్  పాణ్యం :  అంగన్వాడి కార్యకర్తలకు కనీస వేతనం 26 వేలు అమలు చేయాలని  డిమాండ్ చేస్తూ గత మూడు రోజుల నుంచి చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష గురువారం కొనసాగింది. పాణ్యం బస్టాండ్  వద్ద అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె శిబిరంను పాణ్యం మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జి గౌరు చరిత రెడ్డి సందర్శించారు. టిడిపి పార్టీ తరఫున అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం ప్రకటించారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల ముందు వైసిపి అంగన్వాడి కార్యకర్తలు కు తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తాను అని హామీ ఇచ్చారు కానీ, 5 యేళ్లు గడిచిన ఆ హామీ అమలు చేయలేదని ఆ హామీ అమలు చేయలేదని విమర్శించారు. పైగా ఎఫ్ అర్ ఎస్ యాప్ ల పేరుతో పనిభారం పెంచారు అన్నారు. అంగన్వాడి సెంటర్ అద్దెలు, గాస్ బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని,   నెలల తరబడి బకాయిలు ఉంటే అంగన్వాడి కార్యకర్తలు వచ్చే కొద్ది పాటి జీతాల తో సెంటర్స్ ఎలా నడుపుతారు అని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఒక్క రూపాయి జీతం పెంచలేదని వారు విమర్శించారు.  జాతీయ లేబర్ కమిషన్ సిఫార్సు ప్రకారం అంగన్వాడి కార్యకర్తలు కు కనీస వేతనం 26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలకు సేవలు అందిస్తున్న అంగన్వాడి కార్యకర్తలు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు .అంగన్వాడి హ్యాండ్ హెల్పర్స్ యూనియన్. న్యాయమైన 14 రకాల డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని లేని పక్షంలో ఒక మూడు నెలలు ఓపిక పడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు . పాణ్యం ఎంపీటీసీ రంగా రమేష్ రమణమూర్తి .లాయర్ బాబు .హనుమంతు సునీల్ .విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నాయకులు ఎస్ఎఫ్ఐ  ప్రతాప్,  వనం వెంకటాద్రి,  , అటో యూనియన్  నాయకుడు నగరజు, రాజ మండలంలోని అన్ని గ్రామాల అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.

About Author