అంగన్వాడీలకు 20వేలు వేతనం ఇవ్వాలి
1 min read-ర్యాలీ ధర్నా చేపట్టిన అంగన్ వాడీ సిబ్బంది
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: అంగన్వాడీ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారానికీ 26వేల కనీస వేతనాల పెంపు,గ్రాట్యూటీ అమలుకై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని లేనిపక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని ఏఐటియుసి, సీఐటీయూ జిల్లా నాయకులు రఘురాం మూర్తి,రమేష్ బాబు, ఫక్కిరసాహెబ్,ఓబులేసులు హెచ్చరించారు.డిసెంబర్ 8 నుండి ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన నిరవధిక సమ్మె మిడ్తూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ,సీఐటీయూ,ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ మూడు యూనియన్లు కలిసి డిసెంబర్ 8నుండి నిరవధిక సమ్మె ప్రారంభం అయిందని,గత 48 సంవత్సరాల నుండి స్త్రీ శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు సేవలు ఉద్దేశాలు నెరవేర్చి గర్భవతులు,బాలింతలు 6 సంవత్సరాల లోపల పిల్లలకు సేవలు చేస్తున్నామని పాలక ప్రభుత్వాలు అంగన్వాడీ కార్మికులకు గౌరవ వేతనం పేరుతో వెట్టిచాకిరి చేయించుకుంటూ ఏలాంటి ఉద్యోగ భద్రత లేకుండా, ఈఎస్ఐ,ఇన్సూరెన్స్ పెన్షన్ గ్రాడ్యూటీ లేకుండా రోజు రోజుకు యాప్స్ పేరుతో పని భారం పెంచుతూ ఉన్నారని అంతేకాకుండా జిల్లా రాష్ట్ర అధికారులకు విన్నవించినా మా సమస్యల పరిష్కరానికి కృషి చేయడం లేదని,నేటికీ సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా వేతనాలు పెంచి ప్రస్తుతంవిధులలో చనిపోయిన వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ముందుగా ఎంపీడీవో కార్యాలయం నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు,పుణ్యవతి,లక్ష్మి కుమారీ, కమలమ్మ,సరోజ,నాగేశ్వరమ్మ భాగ్యమ్మ,ఇందిరా తదితరులు పాల్గొన్నారు.