NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘అంగన్వాడి’ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి:ఏఐటీయూసీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆస్పరి :  అంగన్​వాడీ వర్కర్స్​ మరియు హెల్పర్స్​ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్​ చేశారు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సుగుణమ్మ, ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి మునిస్వామి, మండల కార్యదర్శి కృష్ణమూర్తి. బుధవారం కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామం లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సూపర్వైజర్ టెస్టులు వెంటనే నిర్వహించాలని, పోస్టులు వయసు తో నిమిత్తం లేకుండా ఇవ్వాలని,  సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కనీస వేతనం 24 వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. అంతేకాక తెలంగాణ మాదిరిగా పెంచిన వేతనాలు వెంటనే అమలు చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు పింఛన్ నెలకు 8000 రూపాయలు ఇవ్వాలి అని అంగన్వాడి సెంటర్ లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు అనంతరం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది  అధ్యక్షురాలుగా సరోజ ప్రధాన కార్యదర్శిగా ప్రమీల గౌరవ అధ్యక్షురాలుగా విశాలాక్షి సహాయ కార్యదర్శులు గా ఉమా, రూత్ అమ్మ,  ఉపాధ్యక్షులుగా నాగమణి,ఎలిజిబెత్ రాణి, కోశాధికారిగా చిట్టెమ్మ తో పాటు 20 మందిని కమిటీ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది, ఈ కార్యక్రమంలో అంగనవాడి కార్యకర్తలు గీతా వాణి, జై లక్ష్మి, వెంగమ్మ  కె నాగమణి తదితరులు పాల్గొన్నారు.

About Author