శిశు మరణాలు తగ్గేలా.. అంగన్వాడిలు పాటుపడాలి.. ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: మాతా శిశు మరణాలు తగ్గించేందుకు అంగన్వాడీలు పాటుపడాలని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సూచించారు. బుధవారం స్థానిక ఐసిడిఎస్ కార్యాలయంలో గర్భవతులు బాలింతలకు సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కిట్లను పంపిణీ చేశారు. మాతా,శిశు మరణాలు తగ్గించేందుకు మన ప్రియతమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల్లో మరింత పగడ్బందీగా పౌష్టికాహారం పంపిణీ చేసేందుకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ తెలిపారు. పత్తికొండ ఐసిడిఎస్ కార్యాలయం నందు సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రారంభించి గర్భవతి బాలింతలకు కిట్లను పంపిణీ చేసి, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇక నుంచి బాలింతలు గర్భవతులకు ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహార సంపూర్ణ పోషణ కిట్లను ఇంటి వద్దకే అందిస్తారన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఐసిడిఎస్ సిబ్బందినీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నారాయణ దాసు, మాజీ పత్తికొండ సర్పంచ్ జి సోమశేఖర్, ఐసిడిఎస్ అధికారిని, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.