మాతా శిశు మరణాలు తగ్గింపుకు అంగన్వాడిలు పాటుపడాలి..
1 min read– జడ్పిటిసి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ గడివేముల: మాతా శిశు మరణాలు తగ్గించేందుకు అంగన్వాడీలు పాటుపడాలని జడ్పిటిసి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో గర్భవతులు బాలింతలకు వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రారంభించి గర్భవతులకు బాలింతలకు పోషణ కిట్లను పంపిణీ చేశారు. మాతా,శిశు మరణాలు తగ్గించేందుకు మన ప్రియతమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల్లో మరింత పగడ్బందీగా పౌష్టికాహారం పంపిణీ చేసేందుకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రారంభించి గర్భవతి బాలింతలకు కిట్లను పంపిణీ చేశారు అనంతరం, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జడ్పిటిసి మాట్లాడుతూ, ఇక నుంచి బాలింతలు గర్భవతులకు ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహార సంపూర్ణ పోషణ కిట్లను ఇంటి వద్దకే అందిస్తారన్నారు. మండలంలోని అన్ని గ్రామాల సెంటర్ల నుండి ఇద్దరినీ ఎంపిక చేసి దాదాపు 30 మంది గర్భవతులకు బాలింతలకు ఈరోజు కిట్లను అందజేసినట్టు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఐసిడిఎస్ సిబ్బందినీ ఆదేశించారు అనంతరం అంగన్వాడి కార్యకర్తలు ఐసిడిఎస్ సూపర్వైజర్ జయలక్ష్మి కళావతమ్మ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వంగాల మహేశ్వర్ రెడ్డి ఉప సర్పంచ్ బాలచేన్ని సొసైటీ చైర్మన్ శేఖర్ రెడ్డి ఎంపీడీవో మల్లేశ్వరప్ప , అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.