NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డిమాండ్ల సాధనకై కదం తొక్కిన అంగన్వాడీలు…

1 min read

ఉద్యమ పోరుబాట లో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చంద్రకళ…

పల్లెవెలుగు వెబ్ ఆళ్లగడ్డ: గత 16 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో బుధవారం ఆళ్లగడ్డ నడిబొడ్డు నుండి శాసన సభ్యుల ఇంటిని ముట్టడించడానికి తమ డిమాండ్ల సాధనకై కదం తొక్కుతూ, నినాదాలు చేస్తూ  పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాసన సభ్యుల ఇంటికి చేరుకున్నారు. ఎమ్మెల్యే ఇంట్లో లేని కారణంగా రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి కి తమ గోడును విన్నవించారు. గౌరవ వేతనం మాకు వద్దు కనీస వేతనం ఇస్తూ గ్రాట్యూటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, తదితర ప్రయోజనాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధానమైన డిమాండ్ తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి, హామీలను నెరవేర్చాలని వారు కోరారు. అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించేందుకు మంత్రి మండలి అధ్యయనం చేసేందుకు  కొంత సమయం కావాలని రాష్ట్ర కమిటీ నాయకులతో చర్చించడం జరిగిందని గంగుల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అధ్యయనం చేసిన తర్వాత మంత్రిమండలి  సూచనల మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బడ్జెట్  కేటాయించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సంయమనం పాటించి సమయం వృధా చేయకుండా మంత్రి మండలి సూచనల మేరకు కొంత వేచి ఉండడం మంచిదన్నారు.  ర్యాలీలో చాగలమర్రి మండలం, ఆళ్లగడ్డ, సిరివెళ్ల, రుద్రవరం, తదితర మండలాల ఏఐటీయూసీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకురాలు, సీతామహాలక్ష్మి, వసుంధర, వహీదా,హసీనా, సుమలత, పద్మావతి, ఇందుమతి, సుజాత, సునీత, రహమత్,బీబీ, గుర్రమ్మ, మేరీ, భార్గవి, అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు పాల్గొన్నారు.

About Author