సచివాలయ అధికారులకు వినతిపత్రం అందించిన అంగన్వాడీలు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: హోళగుంద హెబ్బటం గ్రామ సచివాలయాల అధికారి ముస్కాన మేడంకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు మండల కార్యదర్శి నాగరాజు రైతు సంఘం మండల కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ అంగన్వాడీల జీతాలు పెంచాలని సమస్యలు పరిష్కరించాలని 20వ రోజులు సమ్మె చేస్తున్న చర్చలతో కాలయాపన జరుగుతుంది. జీతాలు పెంచకుండా , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జీతాలను పెంచాలని ఎన్నికల ముందు జగన్ గారు అంగన్వాడీలకు ఇచ్చిన హామీని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కార్మిక చట్టం ప్రకారం నెలకు కనీస వేతన 26 వేలకు పెంచాలని.అంగన్వాడీల సమస్యల ను పరిష్కరించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాచుటీ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలకు పెంచాలి .పెన్షన్స్ సౌకర్యం చివరి జీతం లో 50% ఇవ్వాలి .రాజకీయ జోక్యాన్ని అరికట్టాలి. సూపర్వైజర్ ప్రమోషన్ కి 50 సం// కు పెంచాలి. సర్వీసులో చనిపోయిన అంగన్వాడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలి. అనారోగ్యానికి గురైన అంగన్వాడీలకు వేతనంతో కూడిన లీవ్ సౌకర్యం కల్పించాలి. మెనూ ఛార్జీలను పెంచాలి. గ్యాస్ ప్రభుత్వమే సర్ఫుర చేయాలి .పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు టిఏ బిల్లులు ఇవ్వాలి. ఫేస్ యాప్ లను రద్దు చేయాలి. తదితరుల డిమాండ్ల ను పరిష్కరించాలని కాబట్టి ఎన్నికల ముందు జగన్ గారు అంగన్వాడీలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇప్పటికైనా మా యొక్క న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మెలో కొనసాగుతామని. కావున మా న్యాయమైన సమస్యలను, జీతాలను పెంచి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని తెలియజేశారు. .కార్యక్రమంలో హళగుంద హేబ్బటం అంగన్వాడీ వర్కర్లు. పరిమళ. ఈరమ్మ మంజమ్మ మేనకరాణి ఖాజాబీ సరస్వతి లక్ష్మీదేవి అనిత నాగరత్న కామాక్షి అంగన్వాడీలు వర్కర్లు హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.