PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేదని వ్యాపారులపై ఆగ్రహం..

1 min read

వ్యాపారస్తులు ప్రజల ఆరోగ్యం పై మరింత జాగ్రత్తలు పాటించాలి..

వ్యాపారస్థులకు హితవు వ్యాపార దుకాణాలపై

అకస్మిక దాడులు చేసినడిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : పెదపాడు  జిల్లా గ్రామ పంచాయతీ అధికారికి  కోపం వచ్చింది. ఎప్పుడు సరదాగా ఉండే డిపిఓకి కోపం రావడంతో పంచాయతీ అధికారులు ఉలిక్కి పడ్డారు. వివరాలలోకి వెళితే.  మిచౌoగ్ తుఫాను వలన  గ్రామాలలో వర్షపు నీరు  నిల్వ ఉండడంతో ప్రజలు అనారోగ్య బారిన పడకూడదని  జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్సులకు ఆదేశాలు జారీచేశారు. దానిలో భాగంగా సిబ్బంది పనితీరును పరిశీలించడానికి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేసారు.  త్రాగునీరు ట్యాoకులు పైకెక్కారు, మురుగు కాల్వలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి పంచాయితీ సిబ్బంది పనితీరుపై ఆరాతీసారు. తనిఖీలలో భాగంగా సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించారు.  పనిలో పనిగా పెదపాడు, కొత్తూరు గ్రామాలలో  దుకాణాలను, అంగళ్ళను తనిఖీ చేసిన డిపిఓ శ్రీనివాస విశ్వనాధ్ వ్యాపారుల బాధ్యతారాహిత్యంపై అసహనం వ్యక్తం చేసారు. టీ స్టాల్ల్స్, హోటల్స్, మాంసాహార విక్రయ కేంద్రాలు, తినుబండారాలు, కూల్ డ్రింక్స్ షాపులు ఇలా అనేక దుకాణములు  తనిఖీచేసి బిత్తరపోయారు. దుకాణాల కేంద్రాలవద్ద చెత్త కుండీ లేకపోవడాన్ని గమనించి వ్యాపారస్థులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. అంగళ్ల దగ్గిర చెత్త పేరుకుపోవడం చూసి ఒకవైపు పంచాయితీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పరిసరాలు శుభ్రం చేస్తుంటే లాభాలు ఆశించే వ్యాపారస్తులు  ప్రజల ఆరోగ్యంపై ద్రుష్టి  పెట్టరా అని ప్రశ్నించారు. కొన్ని టీ షాపులు దగ్గిర తాగి  వదిలేసి పారేసిన టీ గలాసులు వాటిపై వాలుతున్న ఈగలు చూసి కోపగించారు.  ఇలాగైతే ప్రజలకు వ్యాధులు రావా అని గుస్సా ప్రదర్శించారు. పంచాయతీ  అనుమతులు లేకుండా వ్యాపారాలు చేస్తున్నారని  పైగా దుకాణుదారులు వారిపరిధిలో పారిశుధ్య నిర్వహరణ చెయ్యకపోవడం వలన దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు డిపిఓ శ్రీనివాస విశ్వనాధ్ దృష్టికి తీసుకురావడంతో పంచాయతీ సిబ్బంది తనిఖీలు ఎందుకు చెయ్యడం లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసారు.  లాభాలు ఆశించి వ్యాపారాలు చేసుకోవడం తప్పు లేదని, తమపరిధిలో పారిశుధ్య నిర్వహణ లేకుండా స్థానిక ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. స్వయంగా వ్యాపారస్తులతో శ్రమదానం చేయించి వ్యాపార కేంద్రాలవద్ద పరిశుభ్రం చేయించారు. ఇకమీదట తప్పు జరుగుతే దుఖాణాలు బందు చేయిస్తామని హెచ్చరించారు. సామజిక బాధ్యతలో భాగంగా వ్యాపారస్తులు అందరు ప్రజల  ఆరోగ్యంపై ద్రుష్టి పెట్టి దుఖాణాలు నడపాలని  హితవు పలికారు.  డిపిపి శ్రీనివాస విశ్వనాధ్ చేసిన ఆకస్మిక తనిఖీకి ప్రజల నుంచి  విశేష స్పందన వచ్చింది.

About Author