NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అనిల్ రావిపూడి, రోజా న్యాయనిర్ణేతలుగా డ్రామా జూనియర్స్ సీజన్ 8

1 min read

ఈ శనివారం రాత్రి 9 గంటలకు.. మీ జీ తెలుగులో!

కర్నూలు, న్యూస్​ నేడు: తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలని అందిస్తూ వినోదం పంచుతున్న ఛానల్ జీ తెలుగు. చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీస్తూ ప్రేక్షకాదరణతో విజయవంతంగా 7 సీజన్లు పూర్తి చేసుకున్న జీ తెలుగు డ్రామా జూనియర్స్ కొత్త సీజన్ 8 ఏప్రిల్ 12న, ప్రారంభం కానుంది , ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు, మీ జీ తెలుగులో!సంవత్సరాల నుంచి ప్రేక్షకులు హృదయాలను గెలుచుకున్న డ్రామా జూనియర్స్ 8వ సీజన్‌తో మరోసారి ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సిద్ధమైంది. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్‌లోని పిల్లల్లో దాగున్న నటనా ప్రతిభను వెలికి తీసే ఉద్దేశ్యంతో కొత్త సీజన్ని ప్రారంభిస్తోంది. ఈ షో ను ఎవర్గ్రీన్ ఎనర్జిటిక్ యాంకర్ సుధీర్ హోస్ట్ చేయనున్నారు. పిల్లల స్కిట్లకీ, సుధీర్ కామెడీ పంచులు, టైమింగ్ తోడైతే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వడం ఖాయం.ప్రతిభ గల చిన్నారులను మరింత ప్రోత్సహించి వారిని ఆశీర్వదించేందుకు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, నటి రోజా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. వరుస హిట్ సినిమాలతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా రాణిస్తున్న అనిల్ రావిపుడి జీ తెలుగు డ్రామా జూనియర్స్ 8 షో ద్వారా బుల్లితెరపై మొదటిసారిగా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ చిన్నారుల బంగారు భవిష్యత్తుకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ఇక, డ్రామా జూనియర్స్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్‌ ఎపిసోడ్ ముఖ్య అతిథులుగా ప్రముఖ నటులు జగపతి బాబు, ఆమని హాజరై చిన్నారుల్లో మరింత ఉత్సాహం నింపనున్నారు. వీళ్ళ  నటనా ప్రతిభ కనబరిచే అద్భుతమైన ప్రదర్శనలు, సరదా సంభాషణలతో డ్రామా జూనియర్స్ సీజన్ 8 ఘనంగా ప్రారంభం కానుంది. ఇక, ఈ సీజన్లో పాల్గొనే చిన్నారులు రెండు జట్లు బాయ్స్ టీమ్, గర్ల్స్ టీమ్ గా  తలపడనున్నారు. గర్ల్స్ టీమ్ కి  యాంకర్ లాస్య, బాయ్స్ టీమ్ కి  త్రినయని సీరియల్ తో  జీ తెలుగు ప్రేక్షకులను అలరించిన నయని మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. మెంటర్ల సారథ్యంలో అలరించే స్కిట్స్ తో  అంతులేని వినోదం పంచే ఈ కార్యక్రమాన్ని జీ తెలుగు వేదికగా ప్రతి శనివారం మీరూ తప్పకుండా చూడండి!

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *