NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దాడి కి పాల్పడిన అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి లను  వెంటనే శిక్షించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: పీలేరు ఎమ్మార్వో ఆఫీస్ లో పనిచేస్తున్న సర్వేయర్ రెడ్డప్ప యాదవ్ పై జరిగిన దాడిని  ప్యాపిలి మండలం యాదవ సంఘం నాయకులు ఖండిస్తున్నారు. ప్యాపిలి మండలం యాదవ సంఘం కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ప్యాపిలి మండల యాదవ సంఘం అధ్యక్షులు రామ్మోహన్ యాదవ్, యువజన సంఘం అధ్యక్షుడు కోదండరామయ్య యాదవ్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ బడుగు బలహీన వర్గాల పై అగ్రవర్ణ కులాల ఆధిపత్య పోరు ఇంకెప్పటికీ మారుతాదితన ఉద్యోగాన్ని తను నిబద్ధతతో చేసుకుంటున్నప్పటికీ కొందరు అగ్రవర్ణ కులాల వైఎస్ఆర్సిపి నాయకులు రెడ్డప్ప యాదవ్ పై అసభ్యకర పదజాలాలతో దూషిస్తూ వారిపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము దాడి కి పాల్పడినటువంటి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి,వారిపై తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము.యాదవులు అంటే ఈ అగ్రవర్ణ కులాలకు ఎందుకు అంత ఈర్ష రాష్ట్రంలో అధిక శాతం కలిగిన యాదవులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని పడగొట్టడానికైనా వెనకాడబోమని వారు హెచ్చరించారు. ఈకార్యక్రమంలో వెంకటరంగయ్య యాదవ్, జంగా రమణయ్య యాదవ్, వేణుగోపాల్ యాదవ్ ,కంబగిరి రాముడు యాదవ్ ,ఈశ్వర్ రెడ్డి యాదవ్ ,సుమన్ యాదవ్, శివకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

About Author