అనితర సాధ్యుడు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్…
1 min readఅనుకున్నది సాధించే వరకు పట్టువదలని విక్రమార్కుడు.
అడ్డంకులు సృష్టించిన బెదరని వ్యక్తిత్వం ఆయన సొంతం.
ముచ్చుమర్రిలో గడపగడప ముగింపు.
కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం లో ప్రారంభం..
పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి లో ముగింపు.
86 సచివాలయాల పరిధిలో 83,460 గృహాలను పలకరించిన ఎమ్మెల్యే ఆర్థర్.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అవ్వ బాగున్నవా.. తాతా పెన్షన్ వస్తుందా ..అక్క జగనన్న ఇంటి స్థలం మంజూరు అయ్యిందా.. అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ఆయనను వెనక్కు లాగేందుకు కొంతమంది నేతలు ప్రయత్నిస్తున్నప్పటికి అనుకున్నది సాధించే వరకు పట్టువదలని విక్రమార్కుడులగా వైసీపీ మరో వర్గం అడ్డంకులు లెక్కచేయకుండా ప్రభుత్వపథకాలు అమలు చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే ఆర్థర్ ప్రజల ఆదరణ పొందడం గమనార్హం. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించిన ముందుకు సాగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ తో గడపగడప కార్యక్రమం పూర్తి చేసిన అనితర సాధ్యుడు తొగురు ఆర్థర్. 162 రోజులలో నియోజకవర్గంలోని 83,460 ఇళ్ళలను ప్రత్యక్షంగా సందర్శించిన ఏకైక నాయకుడు ఎమ్మెల్యే ఆర్థర్. ఏ ఎమ్మెల్యే కు సొంతం కానీ అరుదైన ఘనత ఆయన సొంతం.ప్రతి గ్రామంలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. గడపగడప కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు.
పెద్ద గుమ్మడాపురం లో ప్రారంభించి కొత్త ముచ్చుమర్రి లో ముగించారు…
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి వైసీపీ ప్రభుత్వం ద్వారా అందజేసిన మరియు అందజేస్తున్న వివిద రకాల ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించి ఇంకా వారి అవసరాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 2022 మే 11న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. 2022 మే 11 న కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం గ్రామంలో గడపగడప మన ప్రభుత్వ కార్యక్రమం ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ ప్రారంభించారు. 2023 నవంబరు 7 పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామంలో మంగళవారం కార్యక్రమం పూర్తి చేశారు. మొత్తం 162 రోజులలో మొత్తం 86 సచివాలయాలు, 152 గ్రామాల (మజర) లోని 83,460 గృహాలను ప్రత్యక్షంగా సందర్శించి, జగనన్న ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలను వివరించి, అర్హత ఉండి ఏ కారణం చేతనైనా ప్రభుత్వ పథకాలు ఇంకా రావలసిన వారికి తక్షణమే సంబంధిత అధికారులకు ఆదేశాలను ఇస్తూ, సచివాలయ పరిధిలో అత్యవసరంగా నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం, ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షల రూపాయల ప్రకారం 86 సచివాలయాల పరిధిలో అభివృద్ధి పనుల కోసం రూ. 17 కోట్ల, 20 లక్షల మంజూరు చేయడం జరిగింది.
నిత్యం ప్రజాసేవే ద్వేయంగా…
నిత్యం ప్రజా సేవే ద్యేయంగా అడుగులు ముందుకు వేస్తూ, ప్రజల కష్టాలు తెలుసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ, ఎవరెన్ని విమర్శలు చేసినా భరిస్తూ తన పని తాను చేసుకుంటూ ప్రజల కోసం పరితపించే జన సైనికుడు , ప్రజల నుండి ఒక సౌమ్యుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నాయకుడు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్. గత రెండున్నర ఏళ్ళ పాలనలో ప్రజలకు ప్రతి రోజు అందుబాటులో ఉంటూ అహర్నిశలు శ్రమిస్తూ, ముఖ్యమంత్రి ఆశయాలకు, ఆయన ఆదేశాలను పాటిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారు ఎమ్మెల్యే ఆర్థర్. కరోన సమయంలో ఫస్ట్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లలో ప్రజలకు అందుబాటులో వుంటూ గ్రామాల్లో వీధి వీధిన తిరిగి ప్రజలకు కరోన వైరస్ పై అవగాహన కల్పించి ప్రజల మన్ననలు పొందారు. అంతే కాకుండా కోవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్ కరోన సమయంలో పనుల్లేక, తినేందుకు తిండి లేక ఇబ్బందులు పడే కుటుంబాల్లో నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేసి ఆపద్బాంధవుడిగా పేదలను ఆదుకున్నారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కు సంఘీభావంగా నందికొట్కూరు నియోజకవర్గంలో 189కి. మీ పాదయాత్ర చేసి సంచలనం సృష్టించారు.
గడపగడప చాలా సంతృప్తి ఇచ్చింది..
గడపగడప కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి ఇంటిని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో మరియు మన వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి సందర్శించి,వారికి వున్న సమస్యలను సత్వరమే పరిష్కార దిశగా కొనసాగిన ఈ “గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం” నాకు చాలా సంతృప్తి కలిగించినదని, మన జగనన్న ప్రవేశపెడుతున్న అనేక వినూత్న పథకాలతో ప్రజలకు ఇంకా చేరువై, మరెన్నో సేవలు చేసే భాగ్యం కలిగిందని, ఈ కార్యక్రమం ఆద్యంతం నాకు సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు, వైయస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ సోదరులకు, మీడియా మిత్రులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఎమ్మెల్యే తెలియజేశారు.