రమణీయం..ఆంజనేయుడి రథోత్సవం..
1 min readఅత్యంత వైభవంగా శ్రీమత్ ఆంజనేయ స్వామి 44వ రథోత్సవం..
పల్లెవెలుగు, ఆదోని:కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని క్రాంతినగర్‌లో శ్రీ మత్ ఆంజనేయ స్వామి 44వ రథోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ బుదార్పు లక్ష్మణ్ నేతృత్వంలో శ్రీమత్ ఆంజనేయ స్వామి రథోత్సవం పురవీధుల్లో వేలాది మంది భక్తుల జయజయ ధ్వనుల మధ్య సాగింది. అంతకు ముందు స్వామి వారికి ఉదయం 6 గంటలకు అభిషేకం, అర్చనలు, 7.15 గంటల నుంచి గణపతి పూజ, గంగాపూజ, పుణ్యహవాచనం, గణపతి హోమం, మన్యుసూక్త హోమం, రుద్ర స్వాహాకార హోమం, నవగ్రహ హోమం, రథాంగ హోమం, కలశహోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామి రథోత్సవాన్ని పూలతో అందంగా అలంకరించి… శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి రథోత్సవంను పురవీధుల్లో ఊరేగించారు. మహిళలు కలశాలతో స్వాగతం పలికారు. యువకులు కాగడాల హారతితో స్వామివారి రథోత్సవంను ముందుకు తీసుకెళ్లారు. ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం వరకు రథోత్సవాన్ని తీసుకెళ్లి …తిరిగి రథోత్సవాన్ని యథాస్థలికి తీసుకొచ్చారు. అనంతరం దేవాలయంలో అన్నదానం, తీర్థప్రసాదాన్ని శ్రీ మత్ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ ఉపాధ్యక్షులు పాలుట్ల వెంకటేశ్వర్లు శెట్టి, కార్యదర్శి జక్కా వీరేష్, కోశాధికారి పుట్టా రామాంజనేయులు, కార్యవర్గ సభ్యులు క్యామ శ్రీనివాసులు, మెటికల ఉరుకుందు, ఐ సోమనాథ్, జి. మద్దిలేటి, జె. రామాంజనేయులు, కోట రామాంజనేయులు, యువజన సంఘం సభ్యులు దేవరాజ్, రాఘవేంద్ర, కార్తీక్, రాజు, శివ, భక్తులు పాల్గొన్నారు.