PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిడుగు పడి గొర్రెల కాపరి ఆంజనేయులు మృతి

1 min read

– కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
– ఆంధ్రప్రదేశ్ గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం డిమాండ్ చేశారు
పల్లెవెలుగు వెబ్ నంద్యాల : నంద్యాల జిల్లా, సిరివెళ్ల మండలం, మహాదేవపురం గ్రామానికి చెందిన రాచకుంట్ల ఆంజనేయులు (45 సం.)16- 3 -2023 తేదీన రాత్రి 9 గంటలకు సిరివెళ్ల చెరువు దగ్గర పిడుగు పడి మృతి చెందాడు. గొర్రెలను మేపుకోవడానికి సిరివెళ్ల చెరువు దగ్గర రాత్రి చేరుకున్నారు.* అక్కడే బస చేసిన సందర్భంగా అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షం పడి పిడుగుపాటుకు గురి అయిన ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితోపాటు వీరయ్య గారి శంకర్, అంగడి విశ్వనాధ్, సొరకాయల సాయికుమార్, స్పందన బోయిన మద్దిలేటి, సుభాన్ పిడుగుపాటుకు గురై తీవ్ర గాయాల పాలై నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి. గోవిందు జిల్లా ఉపాధ్యక్షులు డి. శ్రీనివాసులు మహాదేవపురం గ్రామాన్ని సందర్శించి పిడుగుపాటుకు గురి అయ్ మృతి చెందిన ఆంజనేయులు కుటుంబాన్ని మరియు పిడుగుపాటుకు గాయాలపాలైన గొర్రెల కాపరులను ఈరోజు పరామర్శించారు. మృతి చెందిన ఆంజనేయులుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమార్ ఒక కుమారుడు ఉన్నారు. 600 గొర్రెల గుంపు పిడుగుపాటు బారిన పడి అందులో 50 గొర్రెలు మృతి చెందాయి. 30 గొర్రెలు పిడుగుపాటు నుండి కోలుకోలేక ఉన్నాయి. ఇందులో ఆంజనేయులుకు 100 గొర్రెలు ఉన్నాయి. ఆంజనేయులు గొర్రెల పెంపకంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరోనాకాలంలో ఇబ్బందుల వల్ల ఆంజనేయులు నాలుగు లక్షల రూపాయలు ప్రైవేటు వ్యక్తుల వద్ద వడ్డీకి అప్పు చేశారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా, గ్రామీణ బ్యాంకులలో మరో మూడు లక్షలు రూపాయలు అప్పులు తీసుకున్నారు. ప్రస్తుతం పిడుగుపాటు వల్ల ఆంజనేయులు మృతి చెందడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అప్పుల వాళ్లు ఆ కుటుంబాన్ని వేధిస్తున్నారు. వారి పిల్లలు చిన్న వారు కావడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ కుటుంబం దుఃఖంతో విలవిలలాడుతున్నది. కావున కలెక్టర్ గారు మరియు పశుసంవర్ధక శాఖ అధికారులు మానవత్వ దృక్పథంతో ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే ఆంజనేయులు కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ బ్యాంకుల నుండి ఆంజనేయులు కుటుంబం తీసుకున్న అప్పులను రద్దు చేయాలని కలెక్టర్ గారిని కోరారు. ఎన్సిడిసి రుణ పథకం ద్వారా శూరిటీ లేకుండా ఆంజనేయులు కుటుంబాలకి 100 గొర్రెలు మంజూరు చేయాలని కలెక్టర్ గారిని కోరారు. పిడుగుపాటుకు గురైన మిగిలిన ఐదు మంది గొర్రెల పెంపకం దారులకు ఎన్సీడీసీ ద్వారా పూర్తి సబ్సిడీతో రుణాలను మంజూరు చేయాలని అధికారులను కోరారు.ఈ సమావే సమావేశంలో యువజన సంఘం( డివైఎఫ్ఐ) నాయకులు శివ, గొర్రెల పెంపకం దారులు శంకర్, విశ్వనాథ్, సాయికుమార్, మద్దిలేటి పాల్గొన్నారు.

About Author