PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్నతో నిశ్చితార్థ… త‌మ్ముడితో పెళ్లి.. ఆమె ఆత్మహ‌త్య ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : హైదరాబాద్​ పాత బ‌స్తీలోని వ‌ట్టెప‌ల్లికి చెందిన షాహిన్ బేగంకు.. జ‌ల్ ప‌ల్లి న్యూ బాబా న‌గ‌ర్ నివాసి ఇస్మాయిలుద్దీన్ అన్న తో మూడేళ్ల క్రితం నిశ్చితార్థం అయింది. నిశ్చితార్థం అనంత‌రం ఇస్మాయిలుద్దీన్, అత‌ని అన్న ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లారు. కరోన నేప‌థ్యంలో వారు దుబాయ్ లో ఉండిపోయారు. ఇస్మాయిలుద్దీన్ కొన్ని రోజుల త‌ర్వాత ఇంటికి వ‌చ్చాడు. కానీ అత‌డి అన్న మాత్రం ఇంటికి రాలేదు. ఆచూకీ కూడ దొర‌క‌లేదు. షాహిన్ బేగంకు నిశ్చితార్థం అయిన ఇస్మాయిలుద్దీన్ అన్న ఇక ఇంటికి రాడ‌ని నిర్ణయించుకున్న పెద్దలు.. ఇస్మాయిలుద్దీన్ తో షాహిన్ బేగంకు వివాహం చేశారు. కానీ ఇస్మాయిలుద్దీన్ షాహిన్ బేగంతో స‌ఖ్యత‌గా ఉండ‌లేక పోయాడు. అన్నతో నిశ్చితార్థం అయిన మ‌హిళ‌ను తాను పెళ్లి చేసుకోవ‌డం జీర్ణించుకోలేని ఇస్మాయిలుద్దీన్ .. షాహిన్ బేగంను మాన‌సికంగా వేధించాడు. దీంతో పాటు షాహిన్ బేగంకు అత్తమామ‌ల వేధింపులు కూడ తోడ‌య్యాయి. దీంతో మ‌న‌స్థాపం చెందిన షాహిన్ బేగం.. ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహ‌త్య చేసుకుంది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ చేస్తున్నారు.

About Author