అన్న ఎన్టీరామారావు గారి పట్టాభిషేకానికి నేటికీ 41 ఏళ్లు..
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈరోజు, హోళగుంద మండల కేంద్రంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య మాట్లాడుతూ అన్న ఎన్టీ రామారావు పట్టాభిషేకానికి నేటికీ 41 ఏళ్లు అని, నలబై ఒక్క ఏళ్లు క్రితం 1883లో సరిగ్గా ఎదే రోజు నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పట్టాభిషేకం అందుకొని, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని. మళ్లీ చరిత్ర పునరాహృతం కావాలని విధ్వంసకర పాలకుల పీడ నుంచి తెలుగుజాతి విముక్తిని పొంది ప్రపంచంలోనే అత్యున్నత స్థానాన్ని అందుకోవాలి అని కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిగా మహోదయం కోసం ఉద్యమిద్దం అని , ఇంకా మూడు నెలల్లో ఈ కూల్చివేత ప్రభుత్వాన్ని కూల్చి శాశ్వతంగా సమాధి చేసి, ప్రజా ప్రభుత్వాన్ని మన అందరి పార్టీ తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొద్దాం అని ప్రజలకు పిలుపునిచ్చారు.