శివుడి సన్నిధిలో.. అన్నదానం
1 min readభక్తిశ్రద్ధలతో పూజలు చేసిన శివమాలధారులు
- శివమాలధారులకు భిక్ష ఏర్పాటు చేసిన జి. సురేష్
ఆదోని, పల్లెవెలుగు: శివమాల ధరించి.. భక్తిశ్రద్ధలతో దేవుడిని పూజిస్తే…కోటి జన్మల ఫలం లభిస్తుందన్నారు గురుస్వామి శైలేంద్ర స్వామి. ఆదోని పట్టణంలోని శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో శివమాలధారులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శివుడిని కొలుస్తూ… పాటలు పాడుతూ భజన చేశారు. ఆ తరువాత క్రాంతినగర్కు చెందిన జి.సురేష్ స్వామి నేతృత్వంలో శివమాలధారులకు అన్నదానం( భిక్ష) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి శైలేంద్ర స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివమాల ధరిస్తూ.. ఇరుముడిని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలేశుడికి సమర్పిస్తామన్నారు. ఏడాదికేడాది శివమాలధారుల సంఖ్య పెరుగుతోందన్నారు. శ్రీశంభులింగేశ్వర స్వామి సన్నిధిలో శివమాలధారులకు, భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసిన జి.సురేష్ స్వామిని అభినందించారు. కార్యక్రమంలో నీలకంఠస్వామి, లింగోజి స్వామి, గిరి స్వామి, సోమశేఖర్ స్వామి, శివస్వామి, రంగస్వామి, రంగముని స్వామి తదితరులు ఉన్నారు.