‘గణపయ్య’ వద్ద అన్నదానం
1 min readహాజరైన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మేయర్ బీ వై రామయ్య
పల్లెవెలుగు వెబ్: కర్నూలు నగరంలో వినాయక విగ్రహాల వద్ద భక్త బృందాలు వాడవాడలా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, వైయస్సార్సీపి రాష్ట్ర నాయకులు, తెర్నేకల్ సురేంద్ర రెడ్డి, కో ఆప్షన్ మేంబర్ శ్రీరాములు, కార్పోరేటర్ పద్మలత హాజరయ్యారు. వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్న ప్రసాద పంపిణీ చేశారు. బుధవార పేట లో ఎక్కువ శాతం అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. అన్నదాన కార్యక్రమంలో భక్తులు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. బుధవార పేట లోని శ్రీ చెన్నకేశవ స్వామి భక్తబృందం ఆధ్వర్యంలో 15 వ వార్డు వైఎస్ఆర్ సీపీ నాయకులు కేదార్ నాథ్ నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. అక్కడే ఉన్న అంగన్వాడీ కేంద్రం వద్ద మొక్కలు నాటారు. విగ్రహం ఎదుట వైష్ణవి, స్నేహిత, ప్రదర్శించిన కూచిపూడి, జానపద నృత్యం అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కర్నూలు మతసామరస్యానికి చిహ్నం అని అన్నారు. ఏ పండుగ చేసిన హిందువులు ముస్లింలు క్రైస్తవులు సోదరభావంతో జరుపుకుంటారని అన్నారు. ముఖ్యంగా వినాయక నిమజ్జన కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలోనే కర్నూలు మత సామరస్యానికి ప్రత్యేక ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. గురువారం జరిగే నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు సామరస్యంగా జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు మెమెంటోలు అందజేశారు. ఆ తరువాత 15వ వార్డులో అనారోగ్యంతో మృతి చెందిన జయప్రకాష్ కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందించారు. శ్రీ చెన్నకేశవ స్వామి భక్త బృందం సభ్యుడు కేదార్ నాథ్ మాట్లాడుతూ వినాయక చవితి ప్రత్యేక సాంప్రదాయంతో జరుపుకోవాలని అన్నారు. అంతేగాకుండా తొమ్మిది రోజులపాటు వినాయకునికి ఘనంగా పూజలు జరుపుకుంటున్నామన్నారు.
భోజనం వడ్డించిన రామయ్య…
అనంతరం బి వై రామయ్య బుధవార పేట లో వైయస్ఆర్ సీపీ నాయకులు కేదార్ నాథ్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు. నృ త్య ప్రదర్శన చేసిన చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సురేష్, సురేంద్ర, సర్వేష్, నరేష్, ఆదిశేషు, జస్వంత్, వసంత్, హరీష్, పాల్గొన్నారు.