PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్నదానం.. పుణ్యకార్యం.. : లయన్​ చాన్​ బాష

1 min read

పల్లెవెలుగు రాయచోటి:లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో మన లయన్స్ సభ్యులు మాజీ అధ్యక్షులు లయన్ నాగార్జున ఆచారి పుట్టిన రోజు సందర్భంగా గురువారం స్థానిక సుద్దవాండ్లపల్లి రోడ్డు మార్గాన నివసిస్తున్న పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ చాన్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా చాన్​బాష మాట్లాడుతూ పుట్టిన రోజు, ఇతర శుభకార్యాలను పేదల మధ్య జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం గొప్ప పుణ్య కార్యమన్నారు. అనంతరం దాత లయన్ నాగార్జున ఆచారి మాట్లాడుతూ నా పుట్టిన రోజు పురస్కరించుకొని ప్రజలకు ఉపయోగపడే సేవ కార్యక్రమాలు నిర్వహించాలన్న సంకల్పంతో లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ వారిచే అన్నదానం కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఆ తరువాత రీజనల్ కోఆర్డినేటర్ లయన్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రతీ ఒక్కరు సేవా భావం కలిగి ప్రజలకు సేవలు అందించి ప్రజా సేవలో ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమములో ఉపాధ్యక్షులు లయన్ హరీష్ చంద్ర, కోశాధికారి లయన్ విజయ్ కుమార్,లయన్ శివా రెడ్డి,లయన్ మహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.

About Author