శ్రీ చౌడేశ్వరి రామలింగ స్వామి దేవస్థానంలో అన్నదానం..
1 min read– ప్రారంభించిన మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : కార్తీక మాసం సందర్భంగా స్థానిక చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు. స్థానిక పత్తేబాద్ శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 14వ తేదీ నుండి ప్రతిరోజు అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆఖరి రోజు అయిన మంగళవారం ఈరోజు పదివేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఎంతో పురాతనమైన ఈ దేవాలయంలో భక్తులు భక్తితో కోరిన కోర్కెలను పార్వతీ పరమేశ్వరులు తీర్చుతారని నమ్మకం.భక్తుల కోర్కెలను తీర్చే పార్వతీ పరమేశ్వరులు ఆశీస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి,మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని , నగరపాలక సంస్థ మేయర్ గా షేక్ నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు,కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు,ఏలూరు నగర ప్రజలు అందరిపై ఆ స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని మేయర్ నూర్జహాన్ పెదబాబు స్వామివారిని ప్రార్థించామన్నారు.తొలుత ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బళ్లా రవి కుమార్, ధర్మకర్తలు ములుగు పుల్లారావు, దాసరి వెంకటస్వామి,శ్రీమతి య గౌతమి,శ్రీమతి మాడా విశాలాక్షి,పొలగాని వెంకటేశ్వరమ్మ,ఉప్పాడ పార్వతి,ఎక్స్ అఫీషియో మెంబర్ కొడమంచిలి లక్ష్మణరావు, కార్యనిర్వహణ అధికారి డి శంకర్రావు తదితరులు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు కి స్వాగతం పలికి స్వామివారి ముంగిట పూజా కార్యక్రమాలు జరిపించారు.