NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రసవత్తరంగా సాగిన అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ జట్ల క్రికెట్ మ్యాచ్

1 min read

– బ్యాటింగ్‌ చేసి ఆకట్టుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: క్రీడలతో మానసిక ఒత్తిడి తగ్గి, శారీరక ధృడత్వం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్ తెలిపారు.కలెక్టర్‌ వర్సెస్‌ ఎస్పీ జట్ల మధ్య గురువారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పోలీస్ పెరేడ్ మైదానంలో క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ టీంకు కలెక్టర్‌ కెప్టెన్‌గా వ్యవహరించగా ఎస్పీ టీమ్‌కు సంబంధించి ఎస్పీ కెప్టెన్‌గా వ్యవహరించారు. టాస్‌ గెలిచిన ఎస్పీ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ క్రికెట్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా కొనసాగింది. మొదటగా ఎస్పీ టీం బ్యాటింగ్‌ చేసింది. ఎస్పీ టీం 20 ఒవర్లలో 6 వికెట్లు కోల్పోయి 222 రన్‌లను సాధించింది. ఇందులో కలెక్టర్ బ్యాటింగ్ చేసి 11 రన్ లు కొట్టి క్రీడాకారులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 223 పరుగుల చేసింగ్‌ స్కోరుతో ఆటను ప్రారంభించిన కలెక్టర్ టీమ్‌ అన్ని వికెట్లు కోల్పోయి 112 పరుగులు సాధించి 111 రన్ ల తేడాతో ఒటమిని చవిచూసింది. ఆట సమయంలో బౌలింగ్‌ ప్రక్రియను కలెక్టర్‌ ఆధ్వర్యంలో అత్యంత రసవత్తరంగా మారింది. 111 రన్నుల తేడాతో ఎస్పీ టీం గెలుపొందింది. కలెక్టర్ టీమ్ పై గెలుపొందిన ఎస్పీ టీంను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డిఓ రంగస్వామి, కలెక్టరేట్, రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author