‘అన్నమయ్య జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: కలెక్టర్ గిరీష
1 min readపల్లెవెలుగు వెబ్: అన్నమయ్య జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అధికారులు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ ఐ ఏ ఎస్ పేర్కొన్నారు.బుధవారం అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కలెక్టరేట్ వీసీ హాలులో ప్రభుత్వ శాఖల జిల్లా అధికారుల(HODs) తో మరియు తాసిల్దార్ లు ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త జిల్లాలో అన్ని శాఖల అధికారులు ప్రజలతో మమేకం కావాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు… పారదర్శకంగా అమలు చేసి మెరుగైన పాలన, జవాబుదారీతనం, పథకాల అమలులో వేగవంతం, అవినీతిరహితం ప్రాధాన్యత అంశాలుగా పరిపాలన సాగాలన్నారు. అన్నమయ్య కొత్త జిల్లా రాయచోటి కేంద్రంలో అన్ని శాఖలు వెంటనే కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దాదాపు 70 శాతం శాఖలు కార్యాలయాలు ఏర్పాటు చేసి, సిబ్బందితో రాయచోటి కేంద్రానికి వచ్చారు. మిగిలిన 30 శాతం శాఖలు కూడా త్వరితగతిన ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి… కేటాయించిన మేరకు సిబ్బంది అందరూ కూడా వెంటనే విధుల్లో చేరి.. ఈ మేరకు జిల్లాకు కేటాయించబడిన శాఖాధిపతులు (హెచ్ఓడిలు) కార్యాచరణ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఏదైనా సమస్యతో ప్రజలు వస్తే తగిన పరిష్కారం చూపే విధంగా అధికారులు బాధ్యతాయుతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారి వారి స్థాయిలో జిల్లా అధికారులు పరిష్కారం చేయాలని, వారి పరిధిలో లేనివి.. ఉన్నత స్థాయిలో పరిష్కరించాల్సిన వాటి తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం వివిధ అంశాలలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ టి బాపిరెడ్డి, రాయచోటి రాజంపేట మదనపల్లి ఆర్డీఓలు రంగస్వామి కోదండరామిరెడ్డి మురళి వివిధ శాఖల అధికారులు, తాసిల్దార్ లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.