PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా శ్రీసత్య సహాయత చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలు

1 min read

– ట్రస్ట్ చైర్మన్ చప్పిడి.సత్యనారాయణ 52వ జన్మదినో త్సవ వేడుకలు.
– వివిధ రంగాలకు చెందిన వ్యక్తులకు సన్మానాలు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు: ఏలూరు జిల్లా శ్రీ సత్య సహాయత చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలు స్థానిక రామకృష్ణాపురం సాహి త్య మండలి పుల్లాభొట్ల శ్రీ రామ మూర్తి ప్రాంగణ ములో శుక్రవారం ఉదయం ఘనంగా జరిగాయి.ఈవార్షికో త్సవ వేడుకలకు ట్రస్ట్ చైర్మన్ చప్పిడి సత్యనారా యణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ గత కొన్నేళ్ల నుంచి ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రాలకు చెందిన  పోలీసు,సినీ ,కళా, రాజకీయ రంగాలకు అలాగే వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన సేవలను కొనియా డుతూ సన్మాన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు అలాగే ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాల్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో చేపడుతున్నామని తెలిపారు.ముందుగా శ్రీపాద శ్రీ వల్లభ కూచిపూడి నాట్య నిలయం శిష్యులచే స్వాగత నృత్యాంజలి కార్యక్రమం చేపట్టారు.ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నక్క సూర్యచంద్రరావు,విశిష్ట అతిధులుగా రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డా కె. రాజా శిఖామణి,జాతీయ మనవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.రమణ కుమార్,మొదటి మహిళ సంగీత డైరెక్టర్ డా సాజి దాఖాన్ లు మాట్లాడుతూఎవరు ఏ రంగంలో పనిచేస్తున్నా ఆయా రంగాల్లో ప్రతిభతో పాటు సేవాభావాన్ని కూడా అలవర్చు కోవాలని సూచించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులను ఒకే వేదిక పైకి తీసుకువచ్చి ట్రస్ట్ చైర్మన్ చప్పిడి సత్యనారాయణ చేస్తున్న సేవలు అభినంద నీయమని కొనియాడారు. ఎవరూ పుట్టుకతో గొప్ప వ్యక్తులు కాలేరని వారు చేస్తున్న సేవలే వారిని గొప్ప వ్యక్తిగా కీర్తించబడతాయని అన్నారు.ఈసందర్భంగా కొల్లేరు బీసీ సంఘం గౌరవాధ్యక్షులు,వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ నాయకులు,సీనియర్ పొలిటీషియన్ మోరు రామరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవా భావంతో ఉండాలని, గతంలో కొల్లేటి ప్రజలకు కూడా చప్పిడి సత్యనారాయణ ఎన్నో సేవలు చేశారని ఆయన. కళాకారులకు చప్పట్లు అవే అవార్డులు, రివార్డులని సత్యనారాయణను కొనియాడారు.అనంతరం రామరాజును పూలమాలతో ఘనంగా సన్మానించాచి అభినందన జ్ఞాపిక అందజేశారు.అనంతరం ట్రస్ట్ చైర్మన్ చప్పిడి సత్యనా రాయణ 52వ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ ను కట్ చేశారు. ఆయనకు పలువురు అతిధులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం పోలీసు,సినీ,కళా రంగాలకు చెందిన మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ , మూవీ డైరెక్టర్ రమేష్ అర్పిత దంపతులు, తెలుగు షార్ట్ ఫిలిం అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నటుడు, రిటైర్డ్ ఎస్సై వివి. రాంబాబు, ఇరిగేషన్ శాఖ అధికారి దేవరకొండ వెంకటేశ్వర్లు,కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ అధికారి మాముడూరి. మహంకాళి, పశ్చిమగోదావరి జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమసంఘం కార్యదర్శి పెదపాటి రామకృష్ణ,సంగీత డైరెక్టర్ డా యస్.పి.యస్ వాసు, అంబేద్కర్ అవార్డు గ్రహీత మత్తే బాబి, సీనియర్ జర్నలిస్టులు తోట.వెంకట్రావు, యర్రా.జయదాసులను ఘనంగా సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు.ఈకార్యక్రమంలో పలువురు పుర ప్రముఖులు,అతిధిలు తదితరులు పాల్గొన్నారు.

About Author