PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వందేళ్ల చరిత్ర కలిగిన సీతారామ దేవాలయ వార్షికోత్సవం..

1 min read

– ఐదువేల మంది భక్తులకు అన్న సమారాధన
– ఏట శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : అంగరంగ వైభవంగా వందేళ్ల చారిత్రక సీతారాముల దేవాలయం వేడుకలు షడ్రుచులతో మహా అన్నసమరాధన దెందులూరు నియోజకవర్గం మల్కాపురం గ్రామంలో కొలువుదీరిన 100 సంవత్సరాల చరిత్ర కల్గిన సీతారాముల ఆలయం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ప్రత్యేక పూజలతోపాటు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అశేష ప్రజలకు మహా అన్న సమారాధన నిర్వహించారు. ఎన్నో ఏళ్ల నాటి నుండి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని. నేటికి కొనసాగించటం ఆ సీతారాముల దయా కృపా కటాక్షాలతోనే సాధ్యపడుతుందని. గ్రామం లోని ప్రజలు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకతని అన్నారు. ప్రతి ఏటా శ్రీకృష్ణ యాదవ సంఘం, మల్కాపురం గ్రామపెద్దలు సమక్షంలో సీతా రాముల కల్యాణం జరిగిస్తున్నారు. ఈ ఏడాది దేవాలయం వందేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం లో వివిధ ప్రాంతాల వారికి, బంధువులకు పిలుపు ఇవ్వడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. సుమారు 5 వేల మందికి మహా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారి అనుగ్రహంతో ప్రజలు మన్నలు పొందారు. ఈ కార్యక్రమం ఇల్లు ఇoత అద్భుతంగా జరగటంతో యాదవ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పత్యాల సునీత వెంకటేశ్వరావు పూజా కార్యక్రమాల్లో పాల్గొని నేడు అన్న సమారాధన చేశారు. కమిటీ వారు ఆమెకు పుష్పగుచ్చాలు, శాలువా అందించి ఆలయ మర్యాదపూర్వకంగా ప్రత్యేక కృతజ్ఞతలు. కార్యక్రమంలో వెంకటేశ్వరావు, గ్రామ పెద్దలు, దేవాలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author