శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు
1 min readగోడపత్రికలు విడుదలచేసిన ఎమ్మెల్యే ,ఎంపీ.
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : సుప్రసిద్ధ మహాపుణ్యక్షేత్రములలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన దక్షిణకాశీ అనబడు పుష్పగిరిక్షేత్రం పవిత్ర పంచనదీ సంగమపావన పినాకినీ నది తీరమున శివకేశవ అభేదక్షేత్రముగా వెలసి ప్రసిద్ధిగాంచుచున్నది. కొండపైన దేవాలయమునందు శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి, సంతాన మల్లేశ్వరస్వామి వారు ఒకేప్రాకారమున వెలసి నిత్యపూజలతో అఖండతేజోవంతమై విరాజిల్లుతున్న ఈ దేవాలయం శ్రీశైల మహాక్షేత్రానికి నైఋతి ఉపద్వారంగా పిలువబడుతున్న ఈ క్షేత్రం”కాశీతో సమానమైన క్షేత్రమనీ, దక్షిణకాశీ,దక్షిణ ప్రయాగ,మధ్య కైలాసం,భూలోక వైకుంఠం”అని దీనిగురించి బ్రహ్మాండపురాణం, స్కందపురాణం, పుష్పాచల మహాత్మ్యంద్వారా ఎంతోమంది మహర్షులు, మునులు,పుష్పగిరి క్షేత్రంగురించి ప్రస్తావించారు.ఈ ఆలయంలో ఎంతో మంది సిద్ధులు, యోగులు,రాజులు, స్వామివారిని సేవించి తరించారు. భక్తులందరూకూడా స్వామివారిని సేవించి తరించాలనేటువంటి సంకల్పంతో శ్రీ స్వామివార్లకు వార్షిక బ్రహ్మోత్సవములు నిర్వహించబడును. స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర బహుళ త్రయోదశినక్షేత్రంలో శ్రీకామాక్షి వైద్యనాథేశ్వర శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవములు ఏప్రిల్18వతేదీమంగళవారం నుంచీ 27 వతేదీ గురువారం వరకు వైభవంగా జరగనున్నాయి.23వ తేదీ ఆదివారం”అక్షయ తృతీయ” సందర్భంగా భారతి సిమెంట్ వారి సౌజన్యంతో ఫ్లడ్ లైట్ల వెలుతురులోసాయంత్రం 5-00 గం||ల నుంచీ బండలాగుడు పోటీలుగరుడవాహనం 24వతేది సోమవారం ముత్యాల తలంబ్రాలతో అత్యంత వైభవంగా కళ్యాణోత్సవము 25వ తేదీ మంగళవారం రథోత్సవము,27వ తేదీ గురువారం చక్రస్నానం, పుష్పయాగములు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి ల చేతులమీదుగా గోడ పత్రికలు ఆహ్వాన పత్రికలు విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ , ఆలయ అర్చకులు ,కమలాపురం మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.