కైకలూరు రూరల్ సర్కిల్ మండవల్లి పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీ
1 min read
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ రికార్డులు పరిశీలన
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ మంగళవారం మండవల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది జిల్లా ఎస్పీ కి గౌరవ వందనం సమర్పించారు. వార్షిక తనిఖీలలో భాగముగా ఎస్పీ గారు స్టేషన్ ప్రాంగణాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలి. పరిశుభ్రత అనేది ఆరోగ్యంగా జీవించేందుకు ప్రాధాన్యత కలిగిన అంశం. ఆరోగ్యవంతమైన సిబ్బంది ద్వారా సమాజానికి మెరుగైన సేవలు అందించవచ్చు అని సూచించారు. గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో మాట్లాడిన ఎస్పీ గారు, పోలీస్ వ్యవస్థకు వారి యొక్క సేవలు చాలా కీలకమని పేర్కొన్నారు. తమ తమ సచివాలయాల పరిధిలో ఉన్న అసాంఘిక కార్యకలాపాల యొక్క సమాచారం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కు వెంటనే తెలియజేస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచనలు ఇచ్చారు.స్టేషన్‌లో ఉన్న పాత కేసుల రికార్డులు, దర్యాప్తుల పురోగతిని సమీక్షించిన ఎస్పీ, పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణను సైతం సమీక్షించి పనితీరు సంతృప్తికరంగా ఉందని అభినందించారు.మానవత స్వచ్ఛంద సమస్త ద్వారా చలివేంద్రం ను ఏర్పాటు చేయడం వేసవి సమయంలో ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అభినందించిన జిల్లా ఎస్పీ, జిల్లా ఎస్పీతో పాటు ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, కైకలూరు రూరల్ ఇన్స్పెక్టర్ బి. రవికుమార్, మండవల్లి ఎస్‌ఐ రామచంద్రరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.