భ్రమరాంబ దేవికి ఘనంగా వార్షిక కుంభోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబదేవికి మంగళవారం వార్షిక కుంభోత్సవం ఆలయ అర్చకులు వేద పండితులు ఘనంగా నిర్వహించారు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా సాత్విక బలి సమర్పించేందుకు కుంభోత్సవం జరపడం ఆనవాయితీ. ఈ ఉత్సవంలో భాగంగా వేల సంఖ్యలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలను అమ్మవారికి సమర్పిస్తారు. అన్నం రాశిగా పోసి హారతి ఇస్తారు. ఉదయం ప్రాతఃకాల పూజలు ముగిశాక ఆలయంలో అర్చకులు, వేదపండితులు అమ్మవారికి నవావరణ పూజ, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమార్చన జరుపుతారు. ఆలయం ముందు భాగంలో చాకలి వారిచే ముగ్గు వేయించి తొలివిడత సాత్విక బలిగా, నిమ్మ, కొబ్బరికాయలు సమర్పించారు హరిహర రాయ గోపురం వద్ద ఉన్న కోట గోడ కి ఉన్న అమ్మవారికి సాత్విక బలి సమర్పిచారు మల్లికార్జునస్వామి వారికి ప్రదోషకాలపూజలు చేసి అన్నాభిషేకం నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయం ఎదుట సింహ మండపం వద్ద వండిన అన్నాన్ని కుంభరాశిగా పోసి స్ర్తి వేషంలో ఉన్న పురుషుడితో రెండవసారి సాత్విక బలి అర్పిస్తారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి 9 రకాల పిండి వంటలు మహానివేదనగా సమర్పిస్తారు. ఇందుకోసం దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేసింది ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో శ్రీశైలం చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో శిల్పచక్రపాణి రెడ్డి ఆలయ ఈవో రవన్న పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.