సోనియాకు మరోసారి ఈడీ నోటీసు !
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం తాజాగా సమన్లు పంపింది. ఈనెల 21వ తేదీన విచారణకు రావాలని ఆదేశించింది. విచారణ ముందుకు హాజరుకావాలని సోనియాగాంధీకి ఈడీ ఇచ్చిన నాలుగు వారాల గడువు ఈనెల 22తో ముగియనుంది. సమన్ల వాయిదా కోరుతూ గత జూన్‌లో సోనియాగాంధీ చేసిన లిఖిత పూర్వక విజ్ఞప్తిని ఈడీ అంగీకరించింది. కోవిడ్ నుంచి, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకునేంత వరకూ కొద్ది వారాల పాటు తన హాజరును వాయిదా వేయాలని సోనియాగాంధీ కోరారు. జూన్ 12 కోవిడ్ అనంతర సమస్యలతో సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ అదే నెల 18న డిశ్చార్జి అయ్యారు.