మరో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
1 min read
పల్లెవెలుగువెబ్ : ఐఐటీ హైదరాబాద్ కు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. సంగారెడ్డిలోని ఒక లాడ్జ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ నగరానికి చెందిన మేఘా కపూర్ గా గుర్తించారు. మూడు నెలల క్రితమే ఐఐటీలో మేఘా కపూర్ బీటెక్ లో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. బీటెక్ పూర్తయినప్పటి నుంచి సంగారెడ్డిలోని ఆధ్యా లాడ్జిలో ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. మేఘా కపూర్ మృత దేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.