ఈతరం యువతకు స్ఫూర్తి …ములాయం
1 min readపల్లెవెలుగు,వెబ్ నంద్యాల: మతతత్వం, కులతత్వం అత్యంత ప్రభావం చూపే యూపీ లాంటి రాష్ట్రము లో, ఒక మాములు కుటుంబం లో జన్మించిన ములాయం గారి జీవితం ఈతరం యువతకు ఒక చక్కటి పాఠంలాంటిది.కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉన్న రోజులలో, దేశంలోనే మరే రాష్ట్రము లో కూడా లేనంతగా బ్రాహ్మణ జనాభా అత్యధికముగా ఉన్న యూపీ లో కేవలం బ్రాహ్మణలను మాత్రమే ముఖ్యమంత్రులుగా చేస్తూ మిగతా కులాలను చిన్న చూపు చూస్తున్న రోజులవి. అటువంటి కాలంలో ఒక మామూలు బడి పంతులు, మల్ల యుద్ధంలో ఆరితేరిన ములాయం సింగ్ యాదవ్ తన చూపు అన్యాయానికి గురవుతున్న మెజారిటీ ప్రజల వైపు తిప్పారు. తమతో పాటు ఇంకా అణగారిన వర్గాలను చేరదీసి ఆధిపత్య కుల అహంకారానికి ఎదురు నిలిచారు. బహుజన బావజాలంతోనే ఏర్పడిన మరో పార్టీ BSP వ్యవస్థపాకులు మాన్యశ్రీ కాన్షిరాం గారు అంటే నేతాజీ కి చాలా అభిమానం. మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు పార్లమెంట్ లో అని చెప్పి SP, BSP పొత్తులో భాగంగా తన సొంత స్థానం ఇటావా నుంచి మొట్టమొదటి సారిగా మాన్యశ్రీ కాన్షిరాం గారిని పార్లమెంట్ కు పంపిన ఘనత ములాయం గారిది. ఆధిపత్య కుల రాక్షసుల అఘాయిత్యలకు చిన్నప్పటి నుంచి బలై తట్టుకోలేక ఎదురుతిరిగి నిలిచిన ఆడబిడ్డ సోదరి పూలన్ దేవుని దేశం మొత్తం బందిపోటు రాణి, చంబల్ రాణి అని పిలుస్తుంటే తనని చేరదీసి ఎంపీ ని చేసి పార్లమెంట్ కు పంపిన ఘనత శ్రీ ములాయం గారిది. మైనారిటీ లను చిన్న చూపు చూస్తున్న రాష్ట్రము లో అజాంఖాన్ గారిని తన పక్కన చేర్చుకుని మైనారిటీ లకు అండగా నిలిచి యూపీ లాంటి పెద్ద రాష్ట్రము లో అధికారంలోకి వచ్చిన అపర రాజకీయ చాణక్యుడు మన ములాయం గారు. ములాయం సింగ్ యాదవ్ గారు దేశ రక్షణ శాఖా మంత్రి కాకముందు సరిహద్దులో సైనికులు చనిపోతే వారి కుటుంబాలకు చివరి చూపు కూడా దక్కెది కాదు. అది గమనించిన ములాయం గారు రక్షణ మంత్రి కాగానే సైనికుల పార్థివ దేహాలను సైనికలాంచనాలతో వారి కుటుంబ సభ్యులకు అప్పగించే నూతన సంస్కృతి కి శ్రీకారం చుట్టారు. అది దేశం పట్ల, సైన్యం పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి కి నిదర్శనం. ములాయం గారి గొప్పతనం గురించి చెప్పుకోవాలి అంటే అది ఒక పెద్ద గ్రంధమే అవుతుంది. అటువంటి గొప్ప వ్యక్తి ని కోల్పోవటం దేశానికి, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికే కాక యావత్ దేశంలో ఉన్న దళిత బహుజన వర్గాలకు తీరని లోటు.