భారత్ కు మరో పతకం ఖాయం
1 min readపల్లెవెలుగు వెబ్ : టోక్యో ఒలంపిక్స్ లో భారత్ కు మరోపతకం ఖాయమైంది. యువ బాక్సర్ లవ్లీనా బొర్గొహెన్ సెమీస్ కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో చైనీస్ తైపీకి చెందిన మాజీ ప్రపంచ చాంపియన్ నీన్-చిన్ పై 4-1 తేడాతో విజయం సాధించి సెమీస్ లో బెర్త్ ఖరారు చేసుకుంది. తొలిసారిగా ఒలంపిక్స్ లో ఆడుతున్న లవ్లీనా.. సెమీస్ లో గెలిస్తే ఫైనల్ కు వెళ్తుంది. లవ్లీనా స్వస్థం అస్సాం. ఓడిపోయినా కాంస్య పతకం దక్కుతుంది. టోక్యో ఒలంపిక్స్ లో భారత్ కు రానున్న రెండో పతకం ఇది.