NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌ర్నూలు జిల్లాలో… మరో హ‌త్య !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: నంద్యాలో వైఎస్సార్ కాల‌నీలో జ‌గ‌న్ అనే వ్యక్తి దారుణ హ‌త్యకు గుర‌య్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. వివాహేత‌ర సంబంధ‌మే కార‌ణ‌మ‌ని పోలీసులు చెబుతున్నారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టారు. వ‌రుస హ‌త్యల‌తో క‌ర్నూలు ప్రజ‌లు భ‌యాందోళ‌కు గుర‌వుతున్నారు. తాజా ఘ‌ట‌న‌.. గోనెగండ్లలో వివాహేతర సంబంధం కారణంగా శనివారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు… నాలుగైదు రోజుల తేడాతో జిల్లాలో నలుగురి వ్యక్తులు హత్యకు గురైనట్లుగా చెప్పవచ్చు. ఇటీవ‌ల గ‌డివేముల మండ‌లం పెస‌రవాయిలో టీడీపీ నేత‌లు నాగేశ్వ‌ర‌రెడ్డి, ప్ర‌తాప‌రెడ్డి ల దారుణ హ‌త్య రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది. త‌మ్ముడి చిన్నక‌ర్మకు వెళ్లి వ‌స్తున్నవారి మీద దాడి చేసి కిరాత‌కంగా హ‌త‌మార్చడం పట్ల టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

About Author