మరో విద్యార్థిని ఆత్మహత్య !
1 min read
పల్లెవెలుగువెబ్ : తమిళనాడులో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. జూలై 13న కల్లకురిచ్చి జిల్లాలో 17 ఏళ్ల విద్యార్థిని హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. నిన్నటికి నిన్న (సోమవారం) తిరువళ్లూరులోని ప్రభుత్వ పాఠశాల హాస్టల్ గదిలో 12వ తరగతి విద్యార్థిని ఉరేసుకొని విగత జీవిగా కనిపించింది. ఇక ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే తాజాగా మరో మైనర్ విద్యార్థిని అసువులు బాసింది. కడలూరు జిల్లాలో 12వ విద్యార్థినిని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. రెండు వారాల్లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది మూడోసారి.