రాయలసీమకు మరో ముప్పు !
1 min readపల్లెవెలుగు వెబ్: ఇటీవలి భారీ వర్షాలతో దెబ్బతిన్న రాయలసీమకు మరోసారి వానగండం పొంచి ఉంది. ఈనెల 29 నాటికి దక్షిణ అండమాన్ వద్ద బంగాళఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది బలపడి పశ్చిమ వాయివ్య దిశగా ప్రయాణించొచ్చని చెబుతున్నారు. 26న ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలిక పాటి వర్షాలతో పాటు ఒకటి , రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. 28న రాష్ట్రమంతా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.