పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం
1 min readపల్లెవెలుగువెబ్ : దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఇంట విషాదం చోటు చేసుకుంది. పునీత్ భార్య అశ్విని తండ్రి భగ్మనే రేవనాథ్(78) గుండెపోటుతో మరణించారు. పునీత్ మరణానంతరం ఆయన తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం రేవనాథ్కు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.